Prithvi Shaw: మీ ఖర్మకు మీరే బాధ్యులంటూ యువ బ్యాటర్ పృథ్వీ షా ఘాటు వ్యాఖ్యలు

Prithvi Shaw Fires On His Critic In His Cryptic Message
  • ఇటీవల యోయో టెస్టులో ఫెయిల్
  • అతడిపై ఎన్నెన్నో విమర్శలు
  • తన సమస్య తెలియకుండా జడ్జ్ చేయొద్దని షా హితవు
మంచి ట్యాలెంట్ ఉన్న ఆటగాడంటూ అందరి నుంచి మన్ననలు అందుకున్న ఆటగాడు పృథ్వీ షా. కానీ, గాయాలు, ఫామ్ లేమితో తంటాలు పడుతూ జట్టులో స్థానాన్నే ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఈ మధ్యే చేసిన యోయో ఫిట్ నెస్ టెస్ట్ లో అతడు విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా మాత్రం బొటాబొటీ మార్కులతో గట్టెక్కాడు. 

అయితే, తాజాగా పృథ్వీ షా తన ఫాంపై స్పందించాడు. తనను విమర్శిస్తున్న వారికి పరోక్షంగా చురకలంటించాడు. ‘‘నా పరిస్థితేంటో తెలుసుకోకుండా.. దయచేసి నేనేంటన్నది మీరు నిర్ణయించకండి. లేదంటే మీ ఖర్మకు మీరే బాధ్యులు’’ అని పేర్కొంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. 

యోయో టెస్ట్ జస్ట్ ఫిట్ నెస్ కు సంబంధించింది మాత్రమేనని, అతడు ఐపీఎల్ లో ఆడుతున్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే అతడు వరుసగా మూడు రంజీ మ్యాచ్ లు ఆడాడని, అది కూడా యోయో స్కోరుపై ప్రభావం చూపుతుందని చెప్పారు. టీమిండియాలో చోటు దక్కకపోవడానికి కారణం ఫిట్ నెస్ సమస్యలు కారణం అయి ఉండొచ్చని చెప్పారు. కాగా, గత ఏడాది జులైలో కొలంబోలో శ్రీలంకతో జరిగిన టీ20లోనే చివరిసారిగా పృథ్వీ షా మ్యాచ్ ఆడాడు.
Prithvi Shaw
Team India
Yo Yo Test
Cricket
IPL
Delhi Capitals

More Telugu News