Chandrababu: నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించాలి: చంద్ర‌బాబు

chandrababu slams ycp
  • ఏ వ‌ర్గానికీ  ర‌క్ష‌ణ లేదు
  • మచిలీపట్నంలో వీవోఏ రాజ్య‌ల‌క్ష్మి ఆత్మ‌హ‌త్య‌
  • అధికార పార్టీకి చెందిన వ్యక్తి వేధింపుల వ‌ల్లే
  • పోలీసులు స్పందించకపోవడం దారుణమ‌న్న చంద్ర‌బాబు 
కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం మండ‌లంలో వీవోఏల సంఘం నాయ‌కురాలు రాజ్య‌ల‌క్ష్మి వైసీపీ నేత దుర్భాష‌లు, వెకిలి చేష్ట‌ల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని వ‌చ్చిన ఓ వార్త‌ను పోస్ట్ చేస్తూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు.  

'రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదని మచిలీపట్నంలో నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో మరోసారి రుజువైంది. మచిలీపట్నంలో వీవోఏ( విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్)గా పనిచేస్తున్న నాగలక్ష్మి తనను అధికార పార్టీకి చెందిన వ్యక్తి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం దారుణం.

ఒక మహిళ స్వయంగా స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపైనా చర్యలు తీసుకోని ఈ వ్యవస్థను ఏమనాలి? ప్రజల ప్రాణాల కంటే, బాధితుల వేదనల కంటే... రాజకీయ ప్రయోజనాలే పోలీసులకు ప్రాధాన్య అంశంగా మారిపోయాయి. నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించాలి' అని చంద్ర‌బాబు నాయుడు డిమాండ్ చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News