Payani: మాజీ భార్యకు అభినందనలు చెప్పిన ధనుష్!

Congrats my friend Actor Dhanush tweets on Aishwaryaa
  • వైవాహిక బంధం నుంచి తప్పుకున్న ధనుష్-ఐశ్వర్య
  • పయని పేరుతో మ్యూజిక్ సింగిల్ చేసిన ఐశ్వర్య
  • స్నేహితురాలికి అభినందనలు అంటూ ధనుష్ ట్వీట్
వైవాహిక బంధం నుంచి తప్పుకుంటున్నట్టు కోలీవుడ్ నటుడు ధనుష్-ఐశ్వర్య ఇటీవల ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. తాజాగా, ధనుష్ తన అభిమానులను మరోమారు ఆశ్చర్యపరిచాడు. ‘పయని’ పేరుతో ఐశ్వర్య ఓ మ్యూజిక్ సింగిల్‌ను రూపొందించారు. ఈ మ్యూజిక్ సింగిల్‌ను తెలుగులో ‘సంచారి’ పేరుతో విడుదల చేశారు.

ఐశ్వర్య తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వీడియోను విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఐశ్వర్యకు రజనీకాంత్ అభినందనలు తెలిపారు. 9 సంవత్సరాల తర్వాత తిరిగి దర్శకురాలిగా మారినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఆయన ట్వీట్ చూసిన మోహన్‌లాల్ సహా పలువురు నటీనటులు ఐశ్వర్యకు అభినందనలు తెలిపారు. అందరిలాగే ధనుష్ కూడా ట్విట్టర్‌లో ఐశ్వర్యకు అభినందనలు తెలిపాడు. అయితే, ఐశ్వర్యను ఉద్దేశించి వాడిన పదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన స్నేహితురాలికి అభినందనలు అని, ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆ ట్వీట్‌లో ఆకాంక్షించాడు. దీనికి ఆ వీడియో లింకును కూడా జతచేశాడు. అయితే, సరిగ్గా ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐశ్వర్యను స్నేహితురాలిగా పేర్కొనడాన్ని చూసి అభిమానులే కాదు నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు.
Payani
Dhanush
Aishwaryaa
Kollywood

More Telugu News