యోయో టెస్టులో పృథ్వీ షా విఫలం.. ఢిల్లీ కేపిటల్స్ కు షాక్

ఐపీఎల్ సీజన్ ముందు ఢిల్లీ కేపిటల్స్ కు షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్, కీలక బ్యాట్స్ మెన్ పృథ్వీ షా యోయో టెస్టులో విఫలమయ్యాడు. దీంతో ఈ మెగా టోర్నీకి షా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ లో పాల్గొనే ప్రతి ఆటగాడు యోయో టెస్టులో కనీసం 16.5 స్కోరు సాధించాల్సి ఉంటుంది. ఈ స్కోరు సాధించలేని ఆటగాడిని ఐపీఎల్ లో ఆడటానికి అనుమతించరు. మరోవైపు మరో కీలక ఆటగాడు హార్ధిక్ పాండ్యా జస్ట్ పాస్ మార్కులతో బయటపడినట్టు సమాచారం. హార్ధిక్ 17 పాయింట్లకు పైగా స్కోరును సాధించినట్టు తెలుస్తోంది. ఒకవేళ పృథ్వీ షాకు బీసీసీఐ అనుమతిస్తే అతను ఆడే అవకాశం ఉంటుంది.


More Telugu News