Vellampalli Srinivasa Rao: వీరిద్దరూ ఆర్యవైశ్యుల ద్రోహులు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Chandrababu and Pawan Kalyan are anti Arya Vysyas says Vellampalli Srinivas
  • చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఆర్యవైశ్యుల ద్రోహులు
  • రోశయ్యను చంద్రబాబు చాలా ఇబ్బంది పెట్టారు
  • ఆర్యవైశ్యులపై కపట ప్రేమను చూపిస్తున్నారన్న మంత్రి 
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇద్దరూ ఆర్యవైశ్యుల ద్రోహులని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. మాజీ సీఎం రోశయ్య బతికున్నప్పుడు ఆయనను చంద్రబాబు చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఆర్యవైశ్యులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని చెప్పారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాచర్లలో గోపవరపు మల్లికార్జునరావును వేధించారని... దీంతో, ఆయన హఠాత్తుగా మరణించారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఆయన భార్య శ్రీదేవి కూడా చనిపోయారని అన్నారు. అప్పట్లో టీడీపీలో ఉన్న శిద్ధా రాఘవరావును కూడా అవమానాలకు గురి చేశారని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిగా ఉన్న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా మార్చేశారని మంత్రి దుయ్యబట్టారు.
Vellampalli Srinivasa Rao
YSRCP
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News