'సర్కారువారి పాట' సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఖరారు!
- ముగింపు దశలో 'సర్కారువారి పాట'
- సంగీత దర్శకుడిగా తమన్
- ఈ నెల 20వ తేదీన సెకండ్ సింగిల్
- మే 12వ తేదీన సినిమా రిలీజ్
తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన 'కళావతి' పాట జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. రికార్డుస్థాయి వ్యూస్ ను కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో సెకండ్ సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 20వ తేదీన సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ పోస్టర్ వదిలారు.
ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. యాక్షన్ సీన్స్ .. సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. మే 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తరువాత ముందుగా త్రివిక్రమ్ ప్రాజెక్టును .. ఆ తరువాత రాజమౌళి ప్రాజెక్టును మహేశ్ బాబు పట్టాలెక్కించనున్నాడు.