ఇజ్రాయెల్ లో సరికొత్త కరోనా వేరియంట్ గుర్తింపు
- పలు దేశాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- ఇజ్రాయెల్ లో ఒమిక్రాన్ కు చెందిన కొత్త వేరియంట్ గుర్తింపు
- ఈ వేరియంట్ వల్ల ముప్పు ఉండకపోవచ్చన్న ఇజ్రాయెల్
బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు ఉన్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే ఈ వేరియంట్ వల్ల ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ కరోనా ప్రతిస్పందన విభాగం చీఫ్ సల్మాన్ జర్కా తెలిపారు. అందువల్ల ఈ వేరియంట్ వ్యాప్తి, కేసుల గురించి ఆందోళన చెందడం లేదని చెప్పారు.