ఎట్టకేలకు తెలంగాణ కేడర్‌కు ఐపీఎస్ అభిషేక్ మహంతి
- ఉమ్మడి ఏపీ విభజనలో ఏపీకి అభిషేక్
- తెలంగాణ కేడర్‌కు కేటాయించాలన్న యువ ఐపీఎస్
- క్యాట్‌లో విజయం సాధించిన అభిషేక్
- ఏపీ రిలీవ్ చేసినా.. అభిషేక్‌ను చేర్చుకోని తెలంగాణ
- క్యాట్, తెలంగాణ హైకోర్టుల జోక్యంతో అభిషేక్‌కు న్యాయం
అయితే తాను కోరినట్టుగా తనను తెలంగాణ కేడర్‌కు బదిలీ చేయాలని అభిషేక్ మహంతి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్(క్యాట్)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్..అభిషేక్ అభ్యర్థనకు సమ్మతించి ఆయనను తెలంగాణ కేడర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను రిలీవ్ చేయాలని ఏపీకి, చేర్చుకోవాలంటూ తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది.
క్యాట్ ఆదేశాల మేరకు అభిషేక్‌ను ఏపీ రిలీవ్ చేసినా.. తెలంగాణ మాత్రం ఆయనను సర్వీసులోకి తీసుకోలేదు. దీనిపై మరోమారు అభిషేక్ క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన క్యాట్ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై సోమేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోనూ అభిషేక్‌కు అనుకూలంగానే తీర్పు రాగా.. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా అభిషేక్‌ను తెలంగాణ కేడర్‌లోకి తీసుకుంటున్నట్లుగా ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో నెలల తరబడి అఖిషేక్ కొనసాగించిన పోరాటం మంగళవారంతో ముగిసింది.