'జాతకాలను నమ్ముతారా'? అనే ప్రశ్నపై స్పందించిన పూజ హెగ్డే!

Radhe Shyam movie update
  • ఈ నెల 11న విడుదలైన 'రాధేశ్యామ్'
  • ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే 
  • జాతకాలు - విధిరాత చుట్టూ తిరిగే కథ 
  • విధిరాతను నమ్ముతానన్న పూజ హెగ్డే 
ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా రూపొందిన 'రాధేశ్యామ్' ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్ గా కనిపిస్తాడు. జాతకాలు .. విధిరాత చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అందువలన ఈ సినిమాలో ప్రమోషన్స్ లో ప్రభాస్ - పూజ హెగ్డేలకు దానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. 

"మీరు జాతకాలను నమ్ముతారా .. విధిరాతను విశ్వసిస్తారా? అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో పూజ హెగ్డేకి ఎదురుకాగా, తనదైన  శాలిలో ఆమె స్పందించింది. నేను విధిని ఎక్కువగా నమ్ముతాను. విధిరాత ప్రకారమే అంతా జరుగుతుందని భావిస్తూ ఉంటాను. విధిరాత నుంచి ఎవరూ తప్పించుకోలేరు .. దాని బారి నుంచి ఎవరూ తప్పించలేరు. 

ఒక మధ్యతరగతి కుటుంబంలో నేను పుట్టిపెరిగాను. మా ఫ్యామిలీలో అంతా బాగా చదువుకున్నవారే. నేను సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కెరియర్ ఆరంభంలో వరుస ఫ్లాపులు చూశాను. అయినా ధైర్యంతో ముందుకు వెళ్లాను. ఆ రోజున నన్ను అలా నడిపించింది .. ఈ రోజున ఈ స్థాయికి చేర్చింది విధికాక మరేమిటి? అందుకే నేను విధిరాతను నమ్ముతాను" అని చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
Prabhas
Pooja Hegde
Radhakrishna Kumar
Radheshyam Movie

More Telugu News