YS Vivekananda Reddy: పులివెందుల చేరుకున్న వైయస్ వివేకా భార్య, కూతురు, అల్లుడు

YS Vivekananda Reddy family members reaches Pulivendula to participate in his death anniversary
  • నేడు వైయస్ వివేకా మూడో వర్ధంతి
  • మూడేళ్ల క్రితం ఈరోజు దారుణ హత్యకు గురైన వివేకా
  • వివేకా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించనున్న కుటుంబసభ్యులు
మాజీ మంత్రి, దివంగత వైయస్ వివేకానందరెడ్డి మూడో వర్ధంతి నేడు. మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆయన దారుణహత్యకు గురయ్యారు. తొలుత ఆయన గుండెపోటుకు గురై మరణించారనే ప్రచారం జరిగినప్పటికీ... ఆ తర్వాత ఆయన హత్యకు గురయ్యారనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. హత్య కేసులో పెద్దపెద్ద పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

మరోవైపు వివేకా వర్ధంతి నేపథ్యంలో ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. వీరితో పాటు పలువురు కుటుంబసభ్యులు పులివెందులకు వెళ్లారు. వివేకా సమాధి వద్ద వీరు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించి, ఆయనకు నివాళి అర్పించనున్నారు.
YS Vivekananda Reddy
Death Anniversary
Family

More Telugu News