పులివెందుల చేరుకున్న వైయస్ వివేకా భార్య, కూతురు, అల్లుడు
- నేడు వైయస్ వివేకా మూడో వర్ధంతి
- మూడేళ్ల క్రితం ఈరోజు దారుణ హత్యకు గురైన వివేకా
- వివేకా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించనున్న కుటుంబసభ్యులు
మరోవైపు వివేకా వర్ధంతి నేపథ్యంలో ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. వీరితో పాటు పలువురు కుటుంబసభ్యులు పులివెందులకు వెళ్లారు. వివేకా సమాధి వద్ద వీరు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించి, ఆయనకు నివాళి అర్పించనున్నారు.