Elon Musk: పుతిన్, కమాన్.. దమ్ముంటే నాతో తలపడు: ఎలాన్ మాస్క్ సవాల్

Elon Musk Challenges Putin To Single Combat
  • ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తొలి నుంచీ నిరసిస్తున్న మస్క్
  • సింగిల్ బౌట్‌కు సిద్ధపడాలంటూ ట్వీట్
  • గెలిచిన వారే యుద్ధంపై నిర్ణయం తీసుకుంటారన్న మస్క్
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తొలి నుంచీ నిరసిస్తున్న టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ఉక్రెయిన్‌కు ఇప్పటికే బాసటగా నిలిచారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేందుకు స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించి ప్రజలకు నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రపంచ దేశాల అభ్యర్థనలను పెడచెవిన పెట్టిన రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎలాన్ మాస్క్ ఓ చాలెంజ్ విసిరారు. ‘సింగిల్‌గా తేల్చుకుందాం వస్తారా?’ అని ట్వీట్ చేశారు. ఈ పోరులో గెలిచిన వారే రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారని అర్థం వచ్చేలా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. రష్యా అధ్యక్ష భవనాన్ని ట్యాగ్ చేస్తూ మస్క్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Elon Musk
Vladimir Putin
Ukraine

More Telugu News