ఎల్లుండి నుంచి 12- 14 ఏళ్ల పిల్లలకూ వ్యాక్సిన్
- 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్ డోసు కూడా
- ఇప్పటికే 15- 18 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సినేషన్
- ఇప్పటివరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వినియోగం
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి కాసేపటి క్రితం జారీ అయిన ఆదేశాల ప్రకారం 12-14 ఏళ్ల మధ్య పిల్లలతో పాటు 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్ డోసు ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాన్షుక్ మాండవీయా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దేశంలో కొన్ని నెలలుగా సాగుతున్న వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటి వరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు.