Somu Veerraju: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సోము వీర్రాజు

Somu Veerraju wishes Janasena Party on its formation day
  • నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం
  • 9వ ఏట అడుగుపెడుతున్న జనసేన
  • సభ వైభవోపేతంగా జరగాలని వీర్రాజు ఆకాంక్ష
నేటితో జనసేన పార్టీ పురుడు పోసుకుని 8 ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు, నేతలు, జనసైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆవిర్భవించి, రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన పార్టీ జనసేన అని అభివర్ణించారు. బీజేపీ మిత్రపక్షమైన జనసేన ఆవిర్భావ దినోత్సవం వైభవోపేతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

కాగా, మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామం వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సభ కోసం సర్వం సిద్ధమైంది. ఏపీ, తెలంగాణ నుంచి భారీగా జనసైనికులు, పవన్ అభిమానులు వస్తుండడంతో ఏపీ రాజధాని అమరావతి ప్రాంతమంతా కోలాహలం నెలకొంది.
Somu Veerraju
Janasena
Formation Day
Pawan Kalyan
BJP
Andhra Pradesh

More Telugu News