ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

  • బుచ్చయ్య చౌదరి, పయ్యావుల, నిమ్మల, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులుపై సస్పెన్షన్ వేటు
  • సమావేశాలకు అడ్డు తగులుతున్నారంటూ తీర్మానం  
  • బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడులను సస్పెండ్ చేశారు. సమావేశాలకు అడ్డుతగులుతున్న వీరిని బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

ఈ నేపథ్యంలో వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. బడ్జెట్ సమావేశాల సెషన్‌ ముగిసేంత వరకు వీరిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పీకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. మరోవైపు ఐదుగురు సభ్యులను సస్పెండ్ చేసిన నేపథ్యంలో సభలో ఉన్న ఇతర టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.


More Telugu News

Telugudesam Andhra Pradesh AP Assembly Session MLAs Suspension