Lok Sabha: లోక్‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీ అడుగుపెట్ట‌గానే పెద్ద ఎత్తున నినాదాలు చేసిన బీజేపీ ఎంపీలు.. వీడియో ఇదిగో

Modi welcomed by the BJP MPs in Lok Sabha
  • పార్లమెంటు బడ్జెట్‌ రెండో విడత సమావేశాలు ప్రారంభం 
  • పెద్ద ఎత్తున మోదీ మోదీ అంటూ నినాదాలు 
  • ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యంపై అభినంద‌న‌
పార్లమెంటు బడ్జెట్‌ రెండో విడత సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ రోజు లోక్‌సభలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అడుగుపెట్ట‌గానే బీజేపీ ఎంపీలు పెద్ద ఎత్తున మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన గోవా, మ‌ణిపూర్, ఉత్త‌రాఖండ్, ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలోనే బీజేపీ నేత‌లు మోదీ మోదీ అంటూ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అంద‌రికీ అభివాదం చేసుకుంటూ వ‌చ్చి మోదీ కూర్చున్నారు. కాగా, నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంత‌రం దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా, స‌మావేశాలు నేటి నుంచి ఏప్రిల్‌ 8 వరకు జ‌రుగుతాయి.
Lok Sabha
Narendra Modi
BJP

More Telugu News