మెగాస్టార్ సినిమా వైపు మొగ్గుచూపిన రవితేజ

Raviteja in Bobby Movie
  • మాస్ లో రవితేజకి మంచి క్రేజ్
  • వరుస సినిమాలతో బిజీ 
  • చిరూ సినిమా కోసం సంప్రదించిన బాబీ 
  • ఏప్రిల్ నుంచి చిరూ సెట్లో రవితేజ  
రవితేజ తన సినిమాలకి సంబంధించిన లెక్కల విషయంలో చాలా పక్కాగా ఉంటాడు. ఏడాదికి మూడు సినిమాలు తన నుంచి థియేటర్ కి వెళ్లవలసిందే అనే ఒక టార్గెట్ పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తూ వెళతాడు. తన వైపు నుంచి ఏ ప్రాజెక్టును కూడా ఆయన ఆలస్యం కానీయడు. అంతగా ఒక ప్రణాళికతో ముందుకు వెళుతుంటాడు. 

ఇక కెరియర్ తొలినాళ్లలో ఇతర హీరోల సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చాడుగానీ, తనకంటూ ఒక స్టార్ డమ్ వచ్చిన తరువాత మాత్రం, సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేయలేదు. మల్టీ స్టారర్ సినిమాలు చేసే ఆలోచన కూడా చేయలేదు. అలాంటి రవితేజ .. చిరంజీవి సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనే వార్తలు వస్తున్నాయి.

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం రవితేజను సంప్రదించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడేమో ఆయన ఈ సినిమా షూటింగులో ఏప్రిల్లో జాయిన్ అవుతాడని అంటున్నారు. హీరోగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ, చిరంజీవి పట్ల గల అభిమానంతోనే ఈ సినిమాకి ఓకే అనడం జరిగిందని సమాచారం.  
Go Back to Shorts
Chiranjeevi
Raviteja
Bobby Movie

More Telugu News