Rupa Dutta: దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కైన బెంగాలీ సినీ నటి

Actress Rupa Dutta arrested in theft case
  • పుస్తక ప్రదర్శనలో పర్సులు కొట్టేసిన రూపా దత్తా
  • పర్సు చెత్తబుట్టలో పడేస్తుండగా గమనించిన పోలీసు అధికారి
  • బ్యాగ్ తనిఖీ చేయగా రూ. 75 వేల నగదు, కొన్ని పర్సుల గుర్తింపు
ప్రముఖ బెంగాలీ నటి రూపా దత్తాను దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కోల్ కతాలో జరుగుతున్న అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఆమె పర్సులు కొట్టేసింది. దీన్ని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

కొట్టేసిన ఓ పర్సును ఒక చెత్తబుట్టలో ఆమె పడేస్తుండగా ఓ పోలీసు అధికారి గమనించాడు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో... వారికి అనుమానం మరింత బలపడింది. దీంతో, ఆమె బ్యాగ్ ను తనిఖీ చేయగా రూ. 75 వేల నగదుతో పాటు కొన్ని పర్సులు కనిపించాయి. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Rupa Dutta
Bengali Actress
Theft
Arrest

More Telugu News