Nayanthara: నయనతార పెళ్లి జరిగిపోయిందా?

Nayanathara got married
  • దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన్ ఎంగేజ్ మెంట్
  • తాజాగా నుదుటిన కుంకుమ పెట్టుకుని కనిపించిన నయన్
  • ఇద్దరికీ పెళ్లి అయిపోయిందంటూ ప్రచారం
సినీ నటి నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ లు ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారనే విషయం తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందనే వార్తలు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. అయితే వీరి వివాహం జరిగిపోయిందనే విషయం తెలిసి జనాలు షాక్ అవుతున్నారు. ఎవరికీ తెలియకుండానే వీరు వివాహం చేసుకున్నారని... ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

తాజాగా వీరిద్దరూ ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. అక్కడ పూజ ముగించుకుని వచ్చిన నయన్ ను చూసిన జనాలు వీరికి పెళ్లి అయిపోయిందనే నిర్ధారణకు వచ్చేశారు. నుదుటిన కుంకుమ పెట్టుకుని నయన్ దర్శనమిచ్చింది. దీంతో వీరికి పెళ్లి అయిపోయిందని, అయితే ఆ విషయాన్ని వీరు దాస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
Nayanthara
Marriage
Tollywood

More Telugu News