Poonam Kaur: రామ్ చరణ్ గురించి ఎన్నో చెప్పాలని ఉంది: పూనమ్ కౌర్

Poonam Kaur opines on Ramcharan and Pawan Kalyan
  • మళ్లీ ప్రేక్షకుల ముందుకువచ్చిన పూనమ్ కౌర్
  • ఓటీటీలో విడుదలైన నాతిచరామి
  • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు తెలిపిన పూనమ్ 

చాలా కాలం గ్యాప్ తర్వాత నటి పూనమ్ కౌర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన నాతిచరామి చిత్రం ఈ నెల 10న ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర అంశాలను పంచుకుంది. 

పలువురు హీరోల గురించి తన అభిప్రాయాలు వెల్లడించింది. రామ్ చరణ్ గురించి ఎన్నో చెప్పాలని ఉందని, కానీ ఇప్పుడందుకు సమయం కాదని పేర్కొంది. రామ్ చరణ్ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటానని తెలిపింది. 

ఆ ఇంటర్వ్యూలో పవన్ ఫొటో చూడగానే, టక్కున కాంట్రవర్సీ అని పేర్కొంది. ఇంకేం చెప్పను... వాస్తవం అదే కదా అని వెల్లడించింది. తాను పవన్ కల్యాణ్ తో నటించకుండా చాలామంది అడ్డుకున్నారని ఆరోపించింది. ఆయన గురించి తాను పాజిటివ్ గా మాట్లాడినా, నెగెటివ్ గా మాట్లాడినా ప్రాబ్లం అయిపోతుందని పేర్కొంది. అయ్యయ్యో సిగ్గొచ్చేస్తుంది అంటూ పూనమ్ చేతుల్లో ముఖం దాచుకుని సిగ్గుపడింది. 

ఇక మెగాస్టార్ చిరంజీవి తమ కుటుంబం మొత్తానికి ఫేవరెట్ హీరో అని పూనమ్ కౌర్ వెల్లడించింది. బాల్యంలో తన తండ్రితో కలిసి చిరంజీవి సినిమాలకు ఎక్కువగా వెళ్లేదాన్నని తెలిపింది.

  • Loading...

More Telugu News