Chicken: కొండెక్కిన కోడి మాంసం... విపరీతంగా పెరిగిన చికెన్ ధరలు

Chicken rates sky rockets in AP and Telangana
  • తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు నిరాశ
  • కిలో రూ.300 పలుకుతున్న స్కిన్ లెన్ చికెన్
  • కోళ్ల ఫారాల్లో తగ్గిన ఉత్పత్తి
  • పెరిగిన డిమాండ్ తో ధరలకు రెక్కలు

తెలుగు రాష్ట్రాల్లో కోడి మాంసం ధరలు భారీగా పెరిగిపోయాయి. కిలో చికెన్ (స్కిన్ లెస్) ఇప్పుడు రూ.300 పలుకుతోంది. కొన్నివారాల కిందట రూ.200కి లోపే ఉన్న చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. 

అయితే కోడిమాంసం ధరల పెరుగుదలకు వ్యాపారులు పలు కారణాలు చెబుతున్నారు. కోళ్ల ఫారంలలో ఉపయోగించే దాణా రేటు పెరిగిపోవడం, ఫారంలలో కొత్త బ్రీడ్ ప్రారంభించకపోవడంతో ఉన్న కోళ్లతోనే నెట్టుకురావాల్సి ఉండడం వంటి కారణాలు చికెన్ ధరను పెంచేశాయని అంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో కోడిపిల్లలు మృత్యువాత పడతాయని, దానికితోడు బర్డ్ ఫ్లూ వదంతులతో కొత్త బ్రీడ్ వేయడంలేదని పౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు. ఏదేమైనా డిమాండ్ కు తగిన సరఫరా ఉండడం లేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

మామూలు పరిస్థితుల్లో అయితే వేసవి వచ్చిందంటే చికెన్ రేట్లు తగ్గుతాయి. వేసవి తాపానికి కోళ్లు చచ్చిపోతాయని పూర్తి బరువుకు రాకముందే కోళ్లను పౌల్ట్రీ రైతులు అమ్మేస్తుంటారు. దాంతో కిలో చికెన్ ధర రూ.160 నుంచి రూ.180 మధ్యలో ఉండేది. అయితే ఈసారి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగిపోయింది. తద్వారా ధరలు కొండెక్కాయి.

  • Loading...

More Telugu News