DJ Tillu: టిల్లు నమ్మలేదు గానీ.. మీరు నమ్మారు: డీజే టిల్లు హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

DJ Tillu Lady Lead Have An Emotional Note For Fans
  • రాధికను అక్కున చేర్చుకున్నారు
  • డీజే టిల్లును సక్సెస్ చేసిన అందరికీ కృతజ్ఞతలు
  • మీ ప్రేమాభిమానాలు లేకుంటే సాధ్యమయ్యేది కాదని కామెంట్
సినిమా మొదలయ్యే దగ్గర్నుంచి.. శుభం కార్డు పడే దాకా అభిమానుల్ని కడుపుబ్బా నవ్వించిన సినిమా డీజే టిల్లు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందా సినిమా. ‘డీజే టిల్లు’గా సిద్ధు జొన్నలగడ్డ నటన ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. హీరోయిన్ గా నేహా శెట్టి కూడా తన నటనతో ఆకట్టుకుంది. హీరోను మోసం చేసే పాత్రలో ఒదిగిపోయింది. ‘అక్కా..’ అంటూ ఆమెను టిల్లు ఆటపట్టించే సన్నివేశాలు కట్టిపడేస్తాయి. 

తాజాగా, హీరోయిన్ నేహా శెట్టి స్పందించింది. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘రాధికను టిల్లు నమ్మలేదు. కానీ, మీరు నమ్మారు. మీరంతా రాధికను అక్కున చేర్చుకున్నారు. మీ అందరినీ రాధిక కూడా ప్రేమిస్తుంది. డీజే టిల్లును అంతటి సక్సెస్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ప్రతి అడుగు చిరస్మరణీయమయ్యేలా ప్రతి రోజూ ప్రయత్నిస్తానని మాటిస్తున్నా’’ అని ఆమె ట్వీట్ చేసింది.
DJ Tillu
Neha Shetty
Tollywood
Siddhu Jonnalagadda

More Telugu News