Balakrishna: కర్నూలులో అఖండ కృతజ్ఞత సభ.. తన ట్రేడ్ మార్క్ వ్యాఖ్యలతో అదరగొట్టిన బాలయ్య

Balakrishna attends Akhanda thanks giving program in Kurnool
  • 100 రోజులు ఆడిన అఖండ
  • తాము కృషిని నమ్ముతామన్న బాలయ్య
  • మాకు మేమే పోటీ అంటూ వ్యాఖ్యలు
  • ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంతో పోల్చితే ఇప్పటి సినిమాలు 100 రోజులు ఆడడం అంటే అది అద్భుతమే. బాలయ్య నటించిన అఖండ ఆ అద్భుతాన్ని చేసి చూపించింది. ఈ నేపథ్యంలో, కర్నూలులో అఖండ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, బోయపాటి, ఇతర చిత్రయూనిట్ సభ్యులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని మా ద్వారా అందించేందుకు అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. హైందవ సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని ఇనుమడింప చేసిన చిత్రం అని అన్నారు. ఇటువంటి సందేశాత్మక చిత్రాన్ని ఆదరించి విజయం అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు కర్నూలు వచ్చామని వివరించారు.  

అఖండ కర్నూలు జిల్లాలోని మూడు థియేటర్లలో, గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలోని ఒక థియేటర్ లో 100 రోజులు ఆడిందని వెల్లడించారు. అమెరికాలోని థియేటర్లలోనూ అఖండ సినిమా దెబ్బకు స్పీకర్లు బద్దలయ్యాయని తెలిపారు. 

ఈ సందర్భంగా తన ట్రేడ్ మార్క్ డైలాగులతో బాలయ్య అదరగొట్టారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగ రాయాలన్నా మేమే అని వ్యాఖ్యానించారు. మాకు మేమే పోటీ అని ఉద్ఘాటించారు. సింహాకు లెజెండ్ పోటీ, లెజెండ్ కు అఖండ పోటీ అని వ్యాఖ్యానించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే సిద్ధాంతాన్ని తాను, బోయపాటి గట్టిగా నమ్ముతామని బాలకృష్ణ చెప్పారు.
Balakrishna
Akhanda
Thanks Giving Meet
Kurnool

More Telugu News