CM KCR: కందికొండను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు: సీఎం కేసీఆర్

CM KCR saddened after Tollywood lyric writer Kandikonda demise
  • సినీ గీత రచయిత కందికొండ కన్నుమూత
  • కందికొండ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
  • కందికొండ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి
ప్రముఖ సినీ గీత రచయిత కందికొండ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తీవ్ర విషాదంలో ఉన్న కందికొండ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కందికొండ తెలంగాణ సంస్కృతిని పాటల ద్వారా ప్రపంచానికి తెలియజేశారని కొనియాడారు. కందికొండను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాహితీ లోకానికి కందికొండ మృతి తీరనిలోటు అని పేర్కొన్నారు.
CM KCR
Kandikonda
Demise
Lyric Writer
Tollywood
Telangana

More Telugu News