ఒడిశాలో లఖింపూర్ ఖేరి తరహా ఘటన.. 20 మందికి గాయాలు
- లఖింపూర్ ఖేరీలో రైతులపైకి కారు
- ఒడిశాలో జన సమూహంపై ఎమ్మెల్యే కారు
- 20 మందికి పైగా గాయాలు
- గాయపడ్డవారిలో ఏడుగురు పోలీసులు
సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు ఒడిశాలోనూ ఓ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరణాలైతే సంభవించలేదు గానీ.. ఏడుగురు పోలీసులు సహా 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
నేడు చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌కు చెందిన ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ ఇటీవలే సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తన ఇంటి వద్దకు భారీగా చేరుకున్న వారి మీదకు ఆయన తన కారును దూకించేశారు. ఈ ఘటనలో బీజేడీకి చెందిన ఓ కార్యకర్త సహా 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది గాయపడ్దారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఖోర్ధా ఎస్పీ తెలిపారు.