Budda Venkanna: 'నిన్న జగన్ రెడ్డి అసెంబ్లీలో వెకిలిగా కూసిన మూడు కూతలు ఇవి' అంటూ బుద్ధా వెంక‌న్న ట్వీట్

budda venkanna slams jagan
  • చంద్రబాబు సెల్ ఫోన్ కనిపెట్టానని చెప్పుకున్నార‌ని జ‌గ‌న్ అన్నారు
  •  బిల్ గేట్స్, సింధుకి పాఠాలు నేర్పానని అన్నార‌ని జ‌గ‌న్ చెప్పారు
  • ఇలాంటి వ్యాఖ్య‌లు చంద్ర‌బాబు చేయ‌లేద‌న్న బుద్ధా వెంక‌న్న‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్ర‌బాబు నాయుడు చెప్పిన విష‌యాల‌ను వ‌క్రీక‌రిస్తూ జ‌గ‌న్ చెబుతున్నార‌ని బుద్ధా వెంక‌న్న అన్నారు. 'నిన్న జగన్ రెడ్డి అసెంబ్లీలో వెకిలిగా కూసిన మూడు కూతలు. చంద్రబాబు సెల్ ఫోన్ కనిపెట్టానని, బిల్ గేట్స్, సింధుకి పాఠాలు నేర్పానని చెప్పుకుంటా తిరుగుతుంటాడు. జగన్ రెడ్డి వెటకారంగా కూసిన ఈ కూతలు బాబు గారు అనలేదు కానీ, ఈ మూడు రంగాలలో ప్రముఖులు బాబు గారి గురించి ఏమన్నారో చూడండి' అంటూ బుద్ధా వెంక‌న్న ఓ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. 

ఆయా రంగాల ప్ర‌ముఖులు చంద్ర‌బాబు నాయుడి గురించి ప్ర‌శంస‌లు కురిపించిన‌ట్లు ఆ వీడియోలో ఉంది. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో త‌మ‌కు అందించిన సేవ‌ల గురించి అందులో వివరించారు.
Budda Venkanna
Telugudesam
YSRCP

More Telugu News