East Godavari District: సినీ నటుడు మోహన్‌బాబును అరెస్ట్ చేయాలంటూ రాజోలులో నాయీబ్రాహ్మణుల డిమాండ్

Nayee brahmins demand arrest for actors mohanbabu and vishnu
  • మోహన్‌బాబు, మంచు విష్ణు ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్
  • నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తిపై దొంగతనం నేరం మోపడం దారుణమన్న నాయకులు
  • కులం పేరుతో దూషించడం తగదన్న నాయకులు 
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణును అరెస్ట్ చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నాయీబ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. అనంతరం ఆ సేవా సంఘం అధ్యక్షుడు మానుకొండ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రాజోలు తహసీల్దార్ ముక్తేశ్వరరావును కలిసి వినపతిపత్రం అందించారు. 

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాజమహేంద్రవరానికి చెందిన నాగశ్రీను సినీ నటుడు మోహన్‌బాబు వద్ద దశాబ్దకాలంగా నమ్మకంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. అలాంటి శ్రీనుపై దొంగతనం కేసు పెట్టి, కులం పేరుతో దూషించడం తగదని అన్నారు. మోహన్‌బాబు, మంచు విష్ణు ఆరోపిస్తున్నట్టుగా దొంగతనం జరిగిందో, లేదో దర్యాప్తు జరిపి తేల్చాలని దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు.
East Godavari District
Razole
Tollywood
Mohan Babu
Manchu Vishnu

More Telugu News