ఏపీలో మరింతగా తగ్గిన కరోనా వ్యాప్తి... కొత్త కేసులు ఎన్నంటే...!

ఏపీలో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 12,092 కరోనా పరీక్షలు నిర్వహించగా, 46 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 134 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత కొన్నిరోజుల మాదిరే కరోనా మరణాలేవీ సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,751 మంది కరోనా బారినపడగా, వారిలో 23,03,361 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 661 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది మరణించారు.
.

Andhra Pradesh
Corona Virus
New Cases
Daily Report
Today Cases

More Telugu News