Komatireddy Raj Gopal Reddy: రేవంత్ తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు: రాజగోపాల్ రెడ్డి

I dont have any personnel conflict with Revanth Reddy says Komatireddy Raj Gopal Reddy
  • రేవంత్ పై నాకు కోపం లేదు
  • టీడీపీ వ్యక్తికి పార్టీ పగ్గాలను అప్పగిస్తే పార్టీ శ్రేణుల్లోకి ఎలాంటి అభిప్రాయం వెళ్తుందో చూసుకోవాలి
  • తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వారికి పగ్గాలు ఇస్తే బాగుండేదన్న రాజగోపాల్ 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగత వైరం లేదని సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఓ వైపు వైరం లేదని చెపుతూనే మరోవైపు తనలోని అసంతృప్తిని ఆయన వ్యక్తపరిచారు. రేవంత్ పై తనకు కోపం ఏమీ లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుపట్టడం లేదని చెప్పారు. అయితే టీడీపీ నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పగ్గాలను అప్పగిస్తే పార్టీ శ్రేణుల్లోకి ఎలాంటి అభిప్రాయం వెళ్తుందో చూసుకోవాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వారికి పార్టీ పగ్గాలను ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినట్టే ఇప్పుడు కేసీఆర్ ను గద్దె దింపేందుకు కొట్లాడాలని అన్నారు.
Komatireddy Raj Gopal Reddy
Congress
Revanth Reddy

More Telugu News