Bandi Sanjay: కేసీఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురి చేసింది: బండి సంజ‌య్

bandi sanjay tweets about kcr health
  • సోమాజిగూడ‌ యశోద ఆసుప‌త్రిలో చేరిన కేసీఆర్
  • అమ్మవారి కృప కేసీఆర్ కు ఉండాల‌న్న‌ బండి సంజ‌య్‌
  • ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్
తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని సోమాజిగూడ‌ యశోద ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. కేసీఆర్ స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆయ‌న‌కు వైద్య పరీక్ష‌లు నిర్వ‌హిస్తున్నార‌ని సీఎంఓ కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. దీనిపై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు.  

''తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురి చేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని బండి సంజ‌య్ ట్వీట్ చేశారు.
Bandi Sanjay
BJP
KCR

More Telugu News