KCR: కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు

kcr yadadri visit cancels
  • సీఎంవో వర్గాల ప్ర‌క‌ట‌న‌
  • నేడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవం
  • హాజ‌రుకానున్న ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ షెడ్యూల్ ప్ర‌కారం ఈ రోజు యాదాద్రిలో పర్యటించాల‌ని అనుకున్నారు. అయితే, కారణాంతరాల వ‌ల్ల ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యింద‌ని సీఎంవో వర్గాలు తెలిపాయి. దీంతో నేడు జ‌ర‌గాల్సిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజ‌రుకానున్నారు. తెలంగాణ‌ ప్రభుత్వం తరఫున ఆయ‌న‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 

శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొన‌సాగుతున్నాయి. తిరుకల్యాణ మహోత్సవానికి టీడీడీ కూడా పట్టు వస్త్రాలు సమర్పించింది. క‌రోనా ఆంక్ష‌లు కూడా లేక‌పోవ‌డంతో యాదాద్రికి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లి వస్తున్నారు. 
KCR
TRS
Telangana

More Telugu News