చైనా-భారత్ సైనికాధికారుల మధ్య నేడు కీలక చర్చలు
- గాల్వాన్ ఘర్షణ తర్వాత కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఇప్పటి వరకు 14 విడతలుగా చర్చలు
- అయినా కనిపించని ఫలితం
2020 మే తర్వాత నుంచి 1597 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ పొడవునా ఇరు దేశాల సైనికుల మోహరింపు పెరిగింది. చైనా ఏకపక్షంగా గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు వద్ద భౌతిక మార్పులకు ప్రయత్నిస్తుండడం వివాదాస్పద అంశంగా నలుగుతోంది. చర్చల్లో ఫలితం వస్తుందన్న దానిపై ఇరు దేశాల్లోనూ పెద్దగా ఆశల్లేవు. కానీ, ఇరు వర్గాలు చర్చల కోసం మార్గాలను తెరిచే ఉంచాలన్న అంగీకారానికి వచ్చాయి. 2020 మే నుంచి ఇరు దేశాలు సుమారు 50 వేలకు పైగా సైనికులు, వాహనాలు, ఆయుధాలు, రాకెట్లను మోహరించాయి.