Uttar Pradesh: బీజేపీ ఖాతాలో 273 సీట్లు!.. యూపీలో ముగిసిన కౌంటింగ్‌!

these are the up poll results
  • ఎస్పీ ఖాతాలో 125 సీట్లు
  • బీఎస్పీకి 1, కాంగ్రెస్‌కు 2
  • ఇత‌రుల‌కు 2 సీట్లు
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 403 సీట్లు క‌లిగిన యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ గురువారం ఉద‌యం నుంచి రాత్రి దాకా కొన‌సాగింది. కౌంటింగ్ మొద‌లైన కాసేప‌టికే విజ‌య‌మెవ‌రిదో స్ప‌ష్ట‌మైపోయినా.. అంతిమ ఫ‌లితాలు రావ‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. రాత్రి 9.30 గంట‌ల స‌మ‌యానికి యూపీ ఓట్ల లెక్కింపు పూర్తయింది.

ఈ క్రమంలో బీజేపీ ఏకంగా 273 సీట్ల‌ను గెలుచుకుంది. ఇక బీజేపీకి గ‌ట్టి పోటీ ఇస్తుంద‌నుకున్న స‌మాజ్ వాదీ పార్టీ మాత్రం 125 సీట్ల వ‌ద్దే ఆగిపోయింది. గ‌తంలో యూపీలో అధికారాన్ని చెలాయించిన బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ సింగిల్ సీటుకే ప‌రిమిత‌మైపోయింది. ఇక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కూడా కేవలం రెండు సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఇత‌రులు రెండు సీట్ల‌లో విజ‌యం సాధించారు. మొత్తంగా పెద్ద‌గా సంచ‌ల‌నాలేమీ లేకుండానే యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల మాదిరే వెలువ‌డ్డాయి.
Uttar Pradesh
BJP
samajwadi party
Congress
assembly polls

More Telugu News