Ethara Genda: ఈ పాటను 'ఆర్ఆర్ఆర్' సినిమా చివర్లో చూపిద్దామనుకున్నాం... కానీ అంతవరకు ఆగలేకపోతున్నాం: రాజమౌళి

Rajamouli says they kicking of the countdown with anthem of RRR
  • ఈ నెల 14న ఎత్తర జెండా అనే గీతం విడుదల
  • సినిమా విడుదలకు కౌంట్ డౌన్ ఇదేనన్న రాజమౌళి
  • ఉత్సాహం రెట్టింపు కావడం ఖాయమని వెల్లడి
  • ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు ఆర్ఆర్ఆర్
టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ నెల 25న ఇది గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది. కాగా, ఆర్ఆర్ఆర్ కథాంశం స్ఫూర్తిని చాటే ప్రత్యేక గీతంపై రాజమౌళి ఆసక్తికర ట్వీట్ చేశారు. 

'ఎత్తర జెండా' అంటూ సాగే ఉత్తేజభరిత గీతాన్ని సినిమా చివర్లో చూపించి ఆశ్చర్యానికి గురిచేద్దామని భావించామని, కానీ అంతవరకు ఉద్విగ్నతను ఆపుకోలేకపోతున్నామని వెల్లడించారు. అందుకే మార్చి 14న ఈ పాటను విడుదల చేస్తున్నామని తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదలకు ఈ మనోరంజక గేయం కౌంట్ డౌన్ పలుకుతుందని, అభిమానుల్లో నెలకొన్న ఉత్సాహాన్ని మరింత పెంపొందిస్తుందని తెలిపారు. 

'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ తదితరులు నటించారు. ఇటీవల ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్లను చిత్రబృందం భారీ ఎత్తున నిర్వహించడం తెలిసిందే. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సంక్రాంతి సీజన్ లో వచ్చేదే కానీ, కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.
Ethara Genda
RRR
Anthem
Rajamouli
Countdown
Ramcharan
Junior NTR
Tollywood

More Telugu News