అల్యూమినియం ఫ్యాక్టరీలో దుమ్ము రేపేస్తున్న మహేశ్ బాబు!
- షూటింగు దశలో 'సర్కారువారి పాట'
- మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్
- పాప్యులర్ అయిన కళావతి సాంగ్
- మే 12వ తేదీన సినిమా రిలీజ్
మహేశ్ బాబు మార్కు కామెడీతో పాటు యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న సినిమా ఇది. దుబాయ్ .. గోవా .. స్పెయిన్ లలో చిత్రీకరించిన ఫైట్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం ఖాయమని అంటున్నారు.
ఈ సినిమాకి తమన్ బాణీలను సమకూర్చాడు. ఇప్పటికే 'కళావతి' అనే పాట కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వెళుతోంది. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను మే 12వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రీ - 14 రీల్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.