YSRCP: బీజేపీతో దోస్తానాకు చంద్ర‌బాబు య‌త్నం: విజయసాయిరెడ్డి

vijay sai reddy satires on chandrababu
  • గ‌తంలో ఎస్పీ, తృణ‌మూల్‌తో బాబు దోస్తానా
  • ఎస్పీ ఓట‌మికి బాబు ఐరెన్ లెగ్గే కార‌ణం
  • బీజేపీతో క‌లిసేందుకు బాబు య‌త్నం
  • అఖిలేశ్‌, మ‌మ‌త ఎక్క‌డ దులిపేస్తారేమోన‌ని భ‌యమన్న విజయసాయి 
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి..టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుపై సెటైర్లు సంధించారు. తాజా ఎన్నిక‌ల్లో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓట‌మిపాలైన అఖిలేశ్ యాద‌వ్‌తో గ‌తంలో చంద్ర‌బాబు జ‌త క‌ట్టార‌ని పేర్కొన్న సాయిరెడ్డి.. చంద్ర‌బాబు ఐరెన్ లెగ్ కార‌ణంగానే అఖిలేశ్ పార్టీ క‌ళ్లు తేలేసింద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో మ‌రోమారు అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీతో మ‌ళ్లీ జ‌త క‌ట్టేందుకు చంద్ర‌బాబు చూస్తున్నారంటూ వ్యాఖ్య‌లు చేసిన సాయిరెడ్డి.. అఖిలేశ్ తో పాటు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఎక్కడ త‌న‌ను దులిపేస్తారోన‌ని వేచి చూస్తున్నారంటూ విమ‌ర్శించారు. 
YSRCP
tdp
Vijay Sai Reddy
Chandrababu

More Telugu News