Ukraine: ఉక్రెయిన్ నుంచి ఏపీకి ఇప్పటి వరకు ఎంత మంది విద్యార్థులు తిరిగొచ్చారంటే..!

757 AP students returned from ukraine
  • ఉక్రెయిన్ లో విద్యనభ్యసిస్తున్న 770 మంది
  • ఇప్పటి వరకు తిరిగొచ్చిన వారి సంఖ్య 757
  • తిరిగొచ్చేందుకు సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న నలుగురు విద్యార్థులు
ఉక్రెయిన్ లో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో ఏపీకి చెందిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఆ దేశంపై రష్యా యుద్ధం చేస్తుండటంతో మన వాళ్లు అనేక మంది అక్కడి నుంచి తిరిగొచ్చారు. అక్కడున్న ఇండియన్ ఎంబసీ అధికారుల సహకారంతో వెనక్కొచ్చారు. ఇప్పటి వరకు 757 మంది తిరిగొచ్చినట్టు ఏపీ ఉక్రెయిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ వెల్లడించింది. ఆ దేశంలో మొత్తం 770 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 757 మంది తిరిగొచ్చారని తెలిపింది. మిగిలిన వారిలో నలుగురు తిరిగి వచ్చేందుకు ఉక్రెయిన్ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్నారని చెప్పింది. మిగిలిన వారు రావాల్సి ఉందని తెలిపింది.
Ukraine
AP Students

More Telugu News