Radhe Shyam: 'రాధేశ్యామ్' ఐదు షోలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ

Telangana Government releases GO allowing fifth show for Radhe Shyam
  • 11న విడుదలవుతున్న 'రాధేశ్యామ్'  
  • ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 వరకు
  • మిగిలిన వేళల్లో షోలు వేయరాదన్న సర్కారు 
భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న రాధేశ్యామ్ సినిమా శుక్రవారం (11న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో రోజుకు ఐదు షోలను ప్రదర్శించుకునేందుకు అనుమతినిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 10ను గురువారం జారీ చేసింది. 

ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 వరకు షోలను వేసుకునేందుకు థియేటర్లకు అనుమతినిస్తున్నట్టు పేర్కొంది. ఇక అర్ధరాత్రి 1 నుంచి ఉదయం 10 గంటల్లోపు ఎటువంటి షోలను ప్రదర్శించరాదని అదే జీవోలో స్పష్టం చేసింది. 

రాధేశ్యామ్ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటించింది. ఈ సినిమాకు రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. 11న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ విడుదలకు ఏర్పాట్లు చేశారు. 

ఈ సినిమా గురించి చాలా ముందే సినీ విమర్శకుడు ఉమైర్ సంధూ రివ్యూను ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అసలు సిసలైన సినిమా ఇదేనంటూ, క్లైమాక్స్ అదిరిందని ఆయన కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. గ్రాఫిక్స్ ను ఉపయోగించుకున్న విధానం బాగున్నట్టు చెప్పారు. ఇక సినిమా ఎలా ఉందన్నది ప్రేక్షకులే నిర్ణయించాల్సి ఉంది. 
Radhe Shyam
five shows
go
Telangana

More Telugu News