Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ రికార్డుల వర్షం

UP assembly election results Yogi Adityanath BJP create records
  • ఐదేళ్ల పాలన తర్వాత అధికారం నిలబెట్టుకున్న ఏకైక సీఎం
  • గత 37 ఏళ్లలో తిరిగి అధికారం దక్కించుకున్నదీ యోగియే
  • బీజేపీ యూపీ సీఎంలలో అధికారం కాపాడుకున్న ఒకే ఒక్కడు
యూపీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ ఫూర్ (అర్బన్) స్థానం నుంచి ఘన విజయం సాధించారు. తాజా ఎన్నికలతో బీజేపీ, యోగి ఎన్నో రికార్డులను సృష్టించబోతున్నారు. 

యూపీలో 1952 మే 20న తొలిసారి శాసనసభ ఏర్పాటైంది. 70 ఏళ్లలో 21 మంది సీఎంలు కొలువు దీరారు. ఒక సీఎం మొదటి ఐదేళ్లు పాలన పూర్తి చేసుకుని, విజయవంతంగా రెండో సారి ఎన్నికైంది ఆదిత్యనాథ్ ఒక్కరే.

యూపీలో వరుసగా రెండు పర్యాయాలు సీఎం అవకాశం లభించింది ఐదుగురికే. వారిలో యోగి ఆదిత్యనాథ్ ఐదో వ్యక్తి. గతంలో 1957లో సంపూర్ణానంద, 1962లో చంద్రభాను, 1974లో హేమవతీ నందన్ బహుగుణ, 1985లో ఎన్డీ తివారీకే ఇలా అవకాశం లభించింది.

37 ఏళ్లలో అధికారం నిలబెట్టుకున్న సీఎం ఆదిత్యనాథే. 1985లో అవిభాజ్య యూపీ సీఎంగా ఎన్డీ తివారీ ఉన్నారు. నాడు ఎన్నికల్లో తివారీ మళ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఇంత వరకు మరెవరికీ అది సాధ్యపడలేదు.

యూపీలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ సీఎం ఆదిత్యనాథే. యూపీకి నలుగురు బీజేపీ నేతలు ముఖ్యమంత్రులుగా గతంలో వ్యవహరించారు. కల్యాణ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్ నాథ్ సింగ్ లో ఎవరూ తిరిగి అధికారం నిలబెట్టుకోలేకపోయారు. 

ఎంఎల్ సీగా యోగి ఆదిత్యనాథ్ యూపీని పాలించారు. 2017లో యూపీకి సీఎం అయిన సందర్భంలో ఆయన లోక్ సభ ఎంపీగా ఉన్నారు. దాంతో సీఎంగా అధికారం చేపట్టి నిబంధనల కింద ఆరు నెలల్లోపు ఎంఎల్ సీగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సీటును ఖాళీ చేయించి పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపలేదు. ఇలా ఎంఎల్ సీ సీఎం అయిన నాలుగో వ్యక్తిగా రికార్డు నమోదు చేశారు. గతంలో మాయావతి కూడా ఇలానే ఎంఎల్ సీగా ముఖ్యమంత్రి అయ్యారు.

యూపీలో ఐదేళ్లు పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రుల్లో యోగి మూడో వ్యక్తి. గతంలో మాయావతి 2007-2012, అఖిలేశ్ యాదవ్ 20012-2017 ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు.

నోయిడాలోని న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ పట్టణాన్ని ఎవరు సందర్శిస్తారో.. తదుపరి పర్యాయం వారు అధికారంలోకి రారన్న ఒక నమ్మకం ఉంది. కానీ, 2018 డిసెంబర్ 25న ఆదిత్యనాథ్ తోపాటు, ప్రధాని మోదీ అక్కడకు వెళ్లారు. ఇద్దరూ తిరిగి విజయం సాధించారు.
Yogi Adityanath
records
up
elections

More Telugu News