Congress: గోవా పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

Goa Congress Goes To Supreme Court Over 2017 Defections
  • 2017లో బీజేపీలో చేరిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • నాడు కాంగ్రెస్ కు మొత్తం 17 స్థానాలు
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం
  • స్పీకర్, హైకోర్టుల వద్ద కాంగ్రెస్ కు చుక్కెదురు
ఒకవైపు గోవా రాష్ట్రానికి సంబంధించి తాజా ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా.. మరోవైపు 2017 ఎన్నికల తర్వాత పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 13 స్థానాలు సొంతం చేసుకుంది. అధికారం ఏర్పాటుకు 21 స్థానాలు కావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు బీజేపీ చక్రం తిప్పింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లిపోయారు. పార్టీ ఫిరాయించినందుకు వారిని అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ను కోరింది. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినందున స్పీకర్ కాంగ్రెస్ వినతిని తిరస్కరించారు. 

దీనిపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టు ఆశ్రయించగా, అక్కడా చుక్కెదురైంది. నాటి హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తాజాగా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాటి సంగతేమో కానీ.. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ ఈ అడుగు వేసి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Congress
Supreme Court
goa]
2017 elections
mlas
defection

More Telugu News