DMK: రోడ్డు ప్రమాదంలో డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఇళంగోవన్ కుమారుడి మృతి

DMK Rajya Sabha MP NR Elangovans son killed in road accident
  • పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా ఘటన
  • అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు
  • ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
  • ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్ఆర్ ఇళంగోవన్ కుమారుడు రాకేశ్ ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 22 ఏళ్ల రాకేశ్ పుదుచ్చేరి నుంచి మరో వ్యక్తితో కలిసి చెన్నై వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందగా ఆయనతో పాటు ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మాజీ సీనియర్ న్యాయవాది అయిన ఇళంగోవన్  2020 నుంచి రాజ్యసభలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
DMK
Tamil Nadu
NR Elangovan
Road Accident

More Telugu News