ఉక్రెయిన్ మిలిటరీ బ్యాండ్ నోట ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ పాట!
- బాబీ మెక్ ఫెర్రిన్ పాట పాడిన సైన్యం
- చేతిలో మ్యూజిక్ పరికరాలు
- వెనుక ఉక్రెయిన్ జాతీయ పతాకం
- నెట్టింట వైరల్ గా మారిన వీడియో
ఈ క్రమంలో ప్రజలలో ధైర్యం నూరిపోసేందుకు ఉక్రెయిన్ మిలటరీ బ్యాండ్ 'భయపడొద్దు.. హ్యాపీగా ఉండండనే' అర్థంతో కూడిన బాబీ మెక్ ఫెర్రిన్ కు చెందిన ‘డోంట్ వర్రీ బీ హ్యాపీ’ అనే గీతాన్ని ఆలపించారు. ఐదుగురు సైనికులు మ్యూజిక్ ఇనుస్ట్రుమెంట్లను వాయిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది. సైనికుల వెనుక ఉక్రెయిన్ జాతీయ జెండా కూడా దర్శనమిస్తోంది.