Siddhaarth Malhotra: రష్మిక బాలీవుడ్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు!

Mission Majnu movie relesase date confirmed
  • రష్మిక ఫస్టు హిందీ మూవీ 'మిషన్ మజ్ను'
  • హీరోగా సిద్ధార్థ్ మల్హోత్ర 
  • దర్శకుడిగా శంతను 
  • జూన్ 10వ తేదీన విడుదల
తెలుగు .. కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రష్మిక దూసుకుపోతోంది. వరుస విజయాలను అందుకుంటూ ఔరా అనిపిస్తోంది. తమిళ .. హిందీ భాషల్లోనూ ఇదే స్థాయిని అందుకోవాలనే పట్టుదలతో ఆమె వెళుతోంది. హిందీలో తన మొదటి సినిమాగా ఆమె 'మిషన్ మజ్ను' చేసింది. 

సిద్ధార్థ్ మల్హోత్ర జోడీగా రష్మిక ఈ సినిమాలో నటించింది. శంతను దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కొంతసేపటి క్రితం ప్రకటించారు. జూన్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. 

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రష్మిక, 'మిషన్ మజ్ను' కూడా తప్పకుండా హిట్ అవుతుందనే బలమైన నమ్మకంతో ఉంది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ లోను బిజీ అవుతానని భావిస్తోంది. అందానికీ .. అదృష్టానికి కేరాఫ్ అడ్రస్ గా కనిపిస్తున్న రష్మిక, తొలి ప్రయత్నంలోనే బాలీవుడ్లో హిట్ కొడుతుందేమో చూడాలి.
Siddhaarth Malhotra
Rashmika Mandanna
Shantahu
Mission Majnu Movie

More Telugu News