punjab: ఎన్నికల ఫలితాలకు ముందు పంజాబ్ లో లడ్డూలకు డిమాండ్.. భారీగా ఆర్డర్లు

Preparation of laddu in full swing ahead of result day in Punjab
  • సంబరాలకు ఆయా అభ్యర్థుల సన్నాహాలు
  • గెలుపుపై ధీమాతో లడ్డూల తయారీకి ఆర్డర్లు
  • పెద్ద ఎత్తున తయారీలో మునిగిపోయిన స్వీట్ హోమ్ లు
పంజాబ్ లో ఎన్నికల ఫలితాలకు ముందు కోలాహల వాతావరణం నెలకొంది. విజయం తమదేనని బలంగా నమ్ముతున్న రాజకీయ పార్టీల అభ్యర్థులు ఫలితాల తర్వాత విజయ సంబరాలకు ముందే సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే లడ్డూలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు. దీంతో స్వీట్ల తయారీ సంస్థలకు చేతి నిండా పని లభించింది.

మామూలుగానే పంజాబీలు లడ్డూలను ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో గెలుపు తర్వాత సంబరాల్లో లడ్డూలను పంచిపెట్టేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో తయారీ ఆర్డర్లు ఇచ్చారు. స్వీట్ హోమ్ లలో తయారీ ఫొటోలు చూస్తే వారెంత బిజీగా ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు.

ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ సంస్థలు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)నే విజయం సాధిస్తుందని చెప్పడం తెలిసిందే. మొత్తం 117 స్థానాలకు గాను ఆప్ 70 నుంచి 100 స్థానాల వరకు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ, ఇండియా టుడే, చాణక్య సంస్థలు చెప్పగా.. ఒక్క ఏబీపీ-సీ ఓటర్ మాత్రం ఆప్ 57, కాంగ్రెస్ 26, అకాలీదళ్ 24, బీజేపీ 10 గెలుచుకుంటుందని చెప్పడం గమనార్హం.
punjab
results
laddus
orders

More Telugu News