ఉక్రెయిన్ లోని కీవ్ నుంచి సురక్షితంగా బయటకు తెచ్చిన మోదీకి థ్యాంక్స్ చెప్పిన పాకిస్థాన్ బాలిక.. వీడియో వైరల్
- యుద్ధం జరుగుతున్న కీవ్ లో చిక్కుకుపోయిన ఆస్మా
- కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ సహకారంతో తప్పించుకున్న వైనం
- త్వరలోనే స్వదేశం చేరుకుంటానని ఆశాభావం
‘‘చాలా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మాకు అన్ని విధాలుగా సాయం చేసిన కీవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే, భారత ప్రధానికి కూడా. మేం సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం. భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు’’ అని ఆ వీడియోలో ఆస్మా పేర్కొంది. ఆస్మా ఇప్పుడు పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి ఆమె బయటపడి స్వదేశానికి చేరుకుంటుంది.