Gorantla Butchaiah Chowdary: జగన్ బిగ్ బాస్ లాగా గేమ్ ఆడుతున్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdary slams CM Jagan
  •  ది గ్రేట్ బ్లఫ్ మాస్టర్ జగన్ అంటూ బుచ్చయ్య వ్యాఖ్యలు
  • ఆస్కార్ అవార్డులు కూడా సరిపోవని వ్యంగ్యం
  • మంచి చేస్తున్న ముసుగులో మోసగిస్తున్నారని వ్యాఖ్య  
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఏపీ ప్రజలకు ది గ్రేట్ బ్లఫ్ మాస్టర్ సినిమా చూపిస్తున్నారని విమర్శించారు.  

"చిత్ర పరిశ్రమ ఏపీలో లేదే అని దిగులుపడుతున్న తెలుగు ప్రజలారా... దిగులు పడొద్దు. నయ వంచన స్టూడియోస్ వారి 'ది గ్రేట్ బ్లఫ్ మాస్టర్ జగన్' సిరీస్ మీ కళ్లముందే జరుగుతోంది" అని పేర్కొన్నారు. జగన్ బిగ్ బాస్ లాగా గేమ్ ఆడుతున్నారని, అందులో పైశాచిక ఆనందం పొందుతున్నారని గోరంట్ల విమర్శించారు. వీరి నటన ముందు బహుశా ఆస్కార్ అవార్డులు కూడా సరిపోవేమో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"కత్తితో గుచ్చాలన్నా మేమే, ఆ గుచ్చిన గాయాన్ని కుట్టాలన్నా మేమే!" అంటూ ఎద్దేవా చేశారు. వీళ్లు ప్రజల జేబులు కొట్టేసి, ఆ కొట్టేసిన జేబును వీళ్లే కుడుతున్నట్టు నటిస్తుంటారని తెలిపారు. దొంగ తానై, దొర తానై ప్రజలకు మంచి చేస్తున్న ముసుగులో సమస్యను సృష్టిస్తుంటారని అన్నారు. ఆ సమస్యను మళ్లీ వారే పరిష్కరిస్తున్నట్టు చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు.
Gorantla Butchaiah Chowdary
CM Jagan
Cinema
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News