Imran Khan: ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలంటూ పాకిస్థాన్ లో విపక్షాల భారీ ప్రదర్శన

Pakistan opposition parties demands resignation of Imran Khan
  • పీపీపీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల ప్రదర్శన
  • ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శ
  • 24 గంటల్లో రాజీనామా చేయాలని డిమాండ్
ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా తయారయిందని ఆరోపిస్తూ.. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పీపీపీ నాయకుడు భిలావల్ భుట్టో మాట్లాడుతూ దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. విదేశీ మారకద్రవ్యం నిలువలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు. 24 గంటల్లో ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని... లేనిపక్షంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Imran Khan
Pakistan

More Telugu News