Atchannaidu: అచ్చెన్నాయుడుపై రోజా సెటైర్.. సవాల్ విసిరిన అచ్చెన్న!

Atchannaidu challenges Roja
  • మహిళలపై దాడి చేసిన ఘనత టీడీపీ నేతలదన్న రోజా
  •  గట్టి చట్నీ వేసుకుని తింటే 160 కిలోల బరువు పెరగచ్చంటూ అచ్చెన్నపై సెటైర్ 
  • రోజా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ అచ్చెన్న సవాల్ 
మహిళలంతా జగన్ కు జై కొడుతుంటే ఆ మోతకు నారావారి గుండెల్లో రీసౌండ్ రావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించడం తెలిసిందే. మహిళలపై దాడి చేసిన ఘనత టీడీపీ నేతలదన్నారు. నారావారి నరకాసుర పాలన గురించి రాష్ట్రంలోని మహిళలకు బాగా తెలుసని అన్నారు. 

అంతేకాదు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడ్ని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. మహిళలను బూటు కాలితో తన్నిన వ్యక్తి ఇవాళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడని విమర్శించారు. పార్టీ లేదు, తొక్కాలేదు అన్న వ్యక్తి... ఇవాళ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా 160 సీట్లకు తగ్గకుండా వస్తాయని జోక్ చేస్తున్నారని, గట్టి చట్నీ వేసుకుని తింటే 160 కిలోల బరువు పెరుగుతారేమో కానీ, 160 సీట్ల మాటేమో కానీ ఇప్పుడున్న 23 సీట్లు కాపాడుకోవడం కూడా కష్టమేనని రోజా వ్యంగ్యం ప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో, అచ్చెన్నాయుడు స్పందించారు. రోజా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాకే మహిళలకు ఆస్తిలో హక్కు లభించిందని గుర్తుచేశారు. ప్రజలు మోసపోయి ఓట్లు వేసి జగన్ కు అధికారం కట్టబెట్టారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
Atchannaidu
Roja
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News