anasuya: 'హ్యాపీ ఫూల్స్ డే' అంటూ యాంక‌ర్ అన‌సూయ ట్వీట్

 every troller and meme maker suddenly starts respecting women
  • మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా స్పంద‌న‌
  • ఈ రోజు మాత్ర‌మే మ‌హిళ‌ల‌ను గౌర‌విస్తారని విమ‌ర్శ‌
  • ఈ గౌర‌వ భావం 24 గంట‌ల్లో ముగుస్తుంద‌ని అను ట్వీట్
  • ట్రోల‌ర్లు, మీమ్స్ చేసేవారికి చుర‌క‌లు
మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా యాంక‌ర్ అన‌సూయ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసింది. ఈ రోజు మాత్ర‌మే మ‌హిళ‌ల‌ను గౌర‌విస్తారని ఆమె పేర్కొంది. ట్రోల‌ర్లు, మీమ్స్ చేసేవారు అక‌స్మాత్తుగా మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం ప్రారంభించారని, మ‌హిళ‌లంటే ఏంటో వారు ఒక్క‌సారిగా గ్ర‌హించే రోజు ఇదని అనసూయ చెప్పింది. 

వారిలో ఈ గౌర‌వ భావం 24 గంట‌ల్లో ముగుస్తుంద‌ని, మ‌ళ్లీ మ‌హిళ‌ల ప‌ట్ల‌ ఎప్ప‌టిలాగే వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెప్పింది. హ్యాపీ ఫూల్స్ డే అని ఆమె పేర్కొంది. అన‌సూయ చేసిన ట్వీట్ ప‌ట్ల కొంద‌రు సానుకూలంగా స్పందిస్తూ రిప్లై ఇస్తున్నారు. మ‌రి కొంద‌రు ఆమెను విమ‌ర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
anasuya
Tollywood
Twitter

More Telugu News