Ireland: సూపర్ చాన్స్ కొట్టేసిన ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్.. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి పిలుపు

Ireland pacer Josh Little to join Chennai Super Kings as net bowler
  • నెట్ బౌలర్ గా సేవలు అందించనున్న జోష్
  • ప్రకటించిన క్రికెట్ ఐర్లాండ్
  • గొప్ప అవకాశం లభించడం పట్ల అభినందనలు
ఐర్లాండ్ క్రికెటర్, పేసర్ ‘జోష్ లిటిల్’ కు చక్కని అవకాశం తలుపుతట్టింది. ఈ నెల 26న ఐపీఎల్ - 2022 సీజన్ ఆరంభమవుతుండగా, దీనికంటే ముందు నెట్ బౌలర్ గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చి చేరనున్నాడు. ఈ విషయాన్ని ‘క్రికెట్ ఐర్లాండ్’ (ఐర్లాండ్ క్రికెట్ బోర్డు) స్వయంగా ప్రకటించింది. 

‘‘రానున్న ఐపీఎల్ సీజన్ ఆరంభంలో చెన్నై సూపర్ కింగ్స్ తో కలసి పనిచేసే అవకాశం లభించడం పట్ల జోష్ లిటిల్ కు అభినందనలు. సీఎస్కేకు నెట్ బౌలర్ గా పనిచేసే అవకాశం అద్భుతమైనది’’ అంటూ క్రికెట్ ఐర్లాండ్ ట్వీట్ చేసింది. ఈ నెల 26న ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం అవుతుండగా.. తొలి మ్యాచ్ లో సీఎస్కే, కోల్ కతా జట్లు తలపడనుండడం తెలిసిందే.

ఆయా జట్లు శిక్షణలో భాగంగా నెట్ బౌలర్ల సేవలను వినియోగించుకుంటుంటాయి. ప్రాక్టీస్ సెషన్లలో నెట్ బౌలర్లు బ్యాట్స్ మెన్ కు బౌలింగ్ చేస్తుంటారు. దీంతో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఆయా బౌలర్లకు లభిస్తుంది. అదే సమయంలో బ్యాటర్లకు సన్నద్ధత మెరుగుపడుతుంది.
Ireland
pacer
Josh Little
Chennai Super Kings
CSK
net bowler

More Telugu News